దిల్లీ: 13 జూలై (హి.స.)సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్’ భారత్‌లోని వినియోగదార్లకు ప్రీమియం ఖాతా సబ్‌స్క్రిప్షన్ ఫీజు (చందా రుసుము)ను తగ్గించింది. గతంలో మొబైల్ యాప్ ద్వారా ‘ఎక్స్’ను వినియోగిస్తున్న ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదార్ల నుంచి నెలవారీగా రూ.900 వసూలు చేస్తుండగా, ప్రస్తుతం దాన్ని 48 శాతం తగ్గించి రూ.470కు పరిమితం చేసింది. ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సేవలు ఎంచుకున్న వారి ఐడీ లేదా పేరు పక్కన చెక్‌మార్క్ (బ్లూటిక్) వస్తుంది. వెబ్ ద్వారా ‘ఎక్స్’ను వినియోగిస్తున్న వారి ప్రీమియం చందా రుసుమును రూ.650 నుంచి రూ.427కు తగ్గించింది. బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను రూ.243.75 నుంచి 30 శాతం తగ్గించి రూ.170కి పరిమితం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ