తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. జూ పార్క్ రోడ్డులో చిరుత సంచారం
తిరుమల , 17 జూలై (హి.స.)ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇవాళ తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని అలిపిరి జూ పార్క్ (Zoo Park) రోడ్డుపైకి వచ్చి హల్‌చల
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. జూ పార్క్ రోడ్డులో చిరుత సంచారం


తిరుమల , 17 జూలై (హి.స.)ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇవాళ తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని అలిపిరి జూ పార్క్ (Zoo Park) రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేసింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా అరవింద్ కంటి ఆసుపత్రి వద్ద చెక్కర్లు కొట్టింది. చిరుతను చూసి శ్రీవారి భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. రోడ్డుపైకి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, చిరుత సంచరించి ఫుటేజీ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో క్లియర్‌గా రికార్డ్ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande