అమరావతి, 17 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లో టీడీపీపీ సమావేశానికి ముహుర్తం ఖరారైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం(TDPP) ఈ నెల(జులై) 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి