తెలంగాణ, వికారాబాద్. 2 జూలై (హి.స.)
హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ఐటిఐ శిక్షణ కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయంలోని విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈవిషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు, వికారాబాద్ పట్టణ హిందూ బంధువులు దేవాలయం వద్దకు చేరుకొని జరిగిన సంఘటనను పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ... ప్రశాంతమైన వికారాబాద్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసు వారు పూర్తి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు