శ్రీశైలం, 25 జూలై (హి.స.)
: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 24 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాలు రద్దీ రోజుల్లో అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రద్దీ రోజుల్లో నిర్ణీత వేళల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు ఉంటాయని వివరించారు. ఆగస్టు 8, 22న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉంటాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ