సింహాచలం, 25 జూలై (హి.స.)
: విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలకు శుక్రవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఆలయ బేడా మండపంలో చతుర్భుజ తాయారు, స్వర్ణలక్ష్మి అమ్మవార్లను వేదికపై అధిష్ఠింపజేసి విశేష కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ