హైదరాబాద్, 7 జూలై (హి.స.)
పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్ను విడుదల చేయడంతో పాటు, డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్యు కార్యకర్తలు సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని, వ్యాన్ లో ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్