కాకినాడ, 1 అక్టోబర్ (హి.స.)
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ యువతిని చంపి అశోక్ అనే యువకుడు కూడా తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొద్దీ కాలంగా యువతి, అశోక్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి ఆమె పేరెంట్స్ చదివిస్తున్నారు. ఇక, ఉద్యోగం కోసం చెన్నై వెళ్లిన ప్రియుడు ఎన్నిసార్లు కాల్స్, మెసేజ్ లు పెట్టిన యువతి రిప్లై ఇవ్వకపోవడంతో.. బాలికపై అనుమానం వ్యక్తం చేశాడు అశోక్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ