తెలంగాణ, సిద్దిపేట. 1 అక్టోబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రానికి రైల్వే స్టేషన్ మంజూరైనట్లు మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చామన్నారు. విజయదశమి దసరా పండుగా సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, చిన్నకోడూరు కు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినట్లు లేఖను విడుదల చేశారన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల పక్షాన భారత ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలకు విజయ దశమి కానుకగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మండల ప్రజలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు