అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)
:నగరంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రేపు(గురువారం) దసరా పర్విదనాన కార్నివాల్ నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఈ కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. మూడు వేల మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మైసూరు ఉత్సవాల స్థాయిలో విజయవాడ ఉత్సవాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఉత్సవాలకు లక్షలాది మంది తరలివచ్చారని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ