మహా నవమి రోజు మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం..
విజయవాడ, 1 అక్టోబర్ (హి.స.) దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ 11 రోజులు పాటు…11 అలంకారాల్లో భక్తులకు ద
విజయవాడ


విజయవాడ, 1 అక్టోబర్ (హి.స.)

దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ 11 రోజులు పాటు…11 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తోంది. ఈ రోజు నవరాత్రిలో 10వ రోజు. మహా నవమి సందర్భంగా దుర్గాదేవి శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.

మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు దేవతలంతా తమ శక్తులను జోడించి దుర్గాదేవిని సృష్టించారు. మహా నవమి రోజున దుర్గాదేవిని అపరాజితగా పూజిస్తారు. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు సింహవాహినిగా పది చేతులలో పది ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రోజు మహిషాసురమర్దినికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం, ఎరుపు రంగు పువ్వులతో పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారని .. జీవితంలో కలిగే అన్ని భయాలు తొలగిపోతాయని నమ్మకం. మంత్ర, తంత్ర, యంత్రాలన్నీ జగన్మాతలోనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని.

వాస్తవానికి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది ఒకే తిథి రెండు రోజులు వచ్చింది. దీంతో నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. అందుకనే నవరాత్రి తొమ్మిదో రోజు మహిషాసుర మర్దనిగా దర్శనం ఇచ్చే అమ్మవారు ఈ సంవత్సరం పదో రోజున దర్శనం ఇస్తుంది. రేపు దసరా పండగను.. జరుపుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande