గోదావరికి భారీగా.వరద పెరిగింది
అమరావతి, 1 అక్టోబర్ (హి.స.) : గోదావరికి భారీగా వరద పెరగడంతో డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు లంకగ్రామాలు వరద ముంపులో ఉన్నాయి. మామిడికుదురు మండలం వైనతేయ నదిలో నీటిమట్టం పెరగడంతో పాసర్లపూడి కరకట్ట దిగ
గోదావరికి భారీగా.వరద పెరిగింది


అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)

: గోదావరికి భారీగా వరద పెరగడంతో డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు లంకగ్రామాలు వరద ముంపులో ఉన్నాయి. మామిడికుదురు మండలం వైనతేయ నదిలో నీటిమట్టం పెరగడంతో పాసర్లపూడి కరకట్ట దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్‌వే నీట మునిగింది. దీంతో మూడు లంక గ్రామాలకు రాకపోకలు సాగించే స్థానికులు సహా స్థానిక బాలాజీస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొర్లగుంట మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఇరుకుగా ఉండటంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అప్పనపల్లి ఆలయ స్నాన ఘట్టాల వద్దకు వరదనీరు పోటెత్తింది. పాసర్లపూడి బాడవలోని పడవ విహార కేంద్రం చుట్టూ వరదనీరు చేరింది. లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande