అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇవాళ (బుధవారం) వెల్లడించారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 420 కిలోమీటర్లు, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ