తెలంగాణ, వరంగల్ 1 అక్టోబర్ (హి.స.)
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో గంజాయి తరలిస్తున్న యువకులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ ఆవరణలో బైక్ పై గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని 185 గ్రాముల గంజాయిని, బైకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారిలో ఇద్దరు రాయపర్తి మండలం కేశపురం గ్రామానికి చెందిన వారిగా, మరోకరు రామవరం గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు