ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం.. పాల్గొన్న కలెక్టర్ హైమావతి
తెలంగాణ, సిద్దిపేట. 1 అక్టోబర్ (హి.స.) రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిసిందనే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహ
సిద్దిపేట కలెక్టర్


తెలంగాణ, సిద్దిపేట. 1 అక్టోబర్ (హి.స.)

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిసిందనే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో జరుగుతుందన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా ఎంసీసీ ఓటు హక్కు బృందాలు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ఓటర్లను మభ్యపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేయకుండా నిఘా ఉంచాలని అన్నారు.

స్టాటిక్ సర్వేలెన్స్ టీం ల వద్ద సీసీ కెమెరా, వీడియో, హ్యాండ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిఘా బృందాల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలన్నారు. సరైన పత్రాలు చూపకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళితే సీజ్ చేయాలని అన్నారు. అనుమతులకు మించి లిక్కర్ సరఫరా కాకుండా ఎక్సైజ్ శాఖ తోపాటు నిఘా బృందాలు ఫోకస్ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande