కర్నూలు, 1 అక్టోబర్ (హి.స.)
ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహారాలను అందించింది. వాటిలో కాయలు, పండ్లు కూడా ఉన్నాయి. పండ్లు మంచి రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. అలాంటిది లిచీని పోలి ఉండే రంబుటాన్ అనే పండు. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాలలో ఎక్కువగా దొరుకుతుంది. లిచీ లాగే ఉండే.. ఈ ఎర్రటి రంగు పండు మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. దీని రుచి కొద్దిగా తీపి, పుల్లగా ఉంటుంది. ఈ పండు చిన్నగా అనిపించినప్పటికీ ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. రాంబుటాన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాంబుటాన్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రంబుటాన్ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. రంబుటాన్‌లో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మంచి విధంగా కాపాడుతాయి. అవి చర్మం ముడతలు, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. రాంబుటాన్ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ పండును తినకూడదు. ఈ పండు సీజన్ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉంటుంది. రాంబుటాన్ పండు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.
ఈ పండు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. శరీరంపై గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఇది క్యాన్సర్‌ను నిరోధించగలదు. ఈ యాంటీఆక్సిడెంట్లు వాపుతో పోరాడతాయి. శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్‌ల నుండి రక్షణను అందిస్తుంది. దీనిని కాలేయ క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగించవచ్చు. మరొక నివేదిక ప్రకారం, ప్రతిరోజూ ఐదు రాంబుటాన్లు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
రంబుటాన్ పండు ఎరుపు రంగుతో ముళ్ళుగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే శక్తివంతమైన పండు. ఇందులో ఇనుము, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాంబుటాన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉబ్బసం నివారణకు సహాయపడుతుంది.
రాంబుటాన్ మధుమేహంలోనూ మంచిది. మితంగా తీసుకోవాలి. రాంబుటాన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రాంబుటాన్‌లో మంచి మొత్తంలో భాస్వరం ఉంటుంది. ఇది ఎముకలను నిర్మించడానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి కూడా ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి