అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం
శ్రీకాకుళం,, 1 అక్టోబర్ (హి.స.)అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్ ను సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని కన్నులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. సూర్యుడు ఉత్తరా
అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో


శ్రీకాకుళం,, 1 అక్టోబర్ (హి.స.)అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్ ను సూర్య కిరణాలు తాకాయి.

ఈ అద్భుత దృశ్యాన్ని కన్నులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సమయంలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిపై ఏడాదికి రెండుసార్లు కిరణస్పర్శ జరుగుతుంది. 6 నిమిషాల పాటు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరగ్గా.. దానిని తిలకించిన భక్తులు.. కొత్త అనుభూతి పొందామని చెప్తున్నారు. స్వామివారిని కిరణ స్పర్శలో దర్శిచుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా..ప్రతీ సంవత్సరం అక్టోబర్ 1,2 తేదీల్లో, మార్చి 9,10 తేదీల్లో స్వామివారి పాదాలకు కిరణ స్పర్శ జరుగుతుంది. ఈ ఏడాది కిరణ స్పర్శ జరిగే తేదీల్లో దసరా పండుగ కావడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande