ఛండీగఢ్, 10 అక్టోబర్ (హి.స.)హరియాణలో ఐపీఎస్ అధికారి (IPS officer) వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య (Puran Kumar suicide) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని తన నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన రాసిన 8 పేజీల సూసైడ్ నోట్ (Suicide note)ను పోలీసులు స్వాదినం చేసుకున్నారు. డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన 10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారి తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దళిత ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసును జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) సుమోటోగా స్వీకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV