వాట్సప్‌ బదులుగా స్వదేశీ అరట్టైను ఉపయోగించుకోవచ్చ-సుప్రీంకోర్టు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
వాట్సప్‌ బదులుగా స్వదేశీ అరట్టైను ఉపయోగించుకోవచ్చ-సుప్రీంకోర్టు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.), వాట్సప్‌ బదులుగా స్వదేశీ యాప్‌ అయిన అరట్టైను ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన ఖాతాను వాట్సప్‌ బ్లాక్‌ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. ఓ పాలీ డయాగ్నిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి గత 10-12 ఏళ్లుగా వాట్సప్‌ ద్వారా తన ఖాతాదార్లకు సమాచారం పంపిస్తున్నాడు. ఉన్నట్టుండి వాట్సప్‌ తన ఖాతాను బ్లాక్‌ చేయడంతో ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ 32వ అధికరణం కింద సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. సమాచారం అందజేయడానికి స్వదేశీ యాప్‌ అరట్టై ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande