దుమ్ములేపిన కుల్దీప్, జడేజా... వెస్టిండీస్ ఆలౌట్
న్యూఢిల్లీ, 12 అక్టోబర్ (హి.స.) ఢిల్లీ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయాడు. వెస్టిండీస్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్పిన్ తో మాయాజాలం చేశాడు. దీంతో 248 పరుగులకు కుప్పకూలింది వెస్టి
క్రికెట్


న్యూఢిల్లీ, 12 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయాడు. వెస్టిండీస్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్పిన్ తో మాయాజాలం చేశాడు. దీంతో 248 పరుగులకు కుప్పకూలింది వెస్టిండీస్. 81 ఓవర్లు ఆడి చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే 270 పరుగుల లీడ్ సంపాదించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి దుమ్ము లేపాడు.

అటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసి చుక్కలు చూపించాడు. బుమ్రా అలాగే మహమ్మద్ సిరాజుకు ఒక్కో వికెట్ పడింది. 270 పరుగుల లీడ్ రావడంతో, ఫాలోఆన్ ఆడుతోంది విండీస్. ఇక అంతకుముందు టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 518 పరుగులు చేసింది టీమిండియా. ఇందులో యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేయగా టీమిండియా కెప్టెన్ గిల్ 129 పరుగులు చేశాడు. అనంతరం టీమిండియా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande