ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగితే ఇన్ని లాభాలు తెలుసా?
కర్నూలు, 12 అక్టోబర్ (హి.స.)ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ణవ్యవస్
ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగితే ఇన్ని లాభాలు తెలుసా?


కర్నూలు, 12 అక్టోబర్ (హి.స.)ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమే. కొంతమంది వ్యాయామానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది పనితీరు స్థాయిలను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గ్రీన్‌ టీ రోజూ తాగితే స్ట్రెస్‌ కూడా తగ్గుతుంది. ఇది యాంగ్జైటీని నివారిస్తుంది కూడా. గ్రీన్‌ టీ పంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ టీ లో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మీ శ్వాసను కూడా ఇది తాజాగా ఉంచుతుంది. గ్రీన్‌ టీ ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతుంది. గ్రీన్‌ టీ శరీరంలో కొవ్వు పేరుకోనివ్వకుండా చేస్తుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు గ్రీన్‌ టీ తాగండి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు రెండే. భోజనం లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత మాత్రమే ఈ పానీయం తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande