ఐపీఎస్‌ బలవన్మరణం కేసు.. రోహ్‌తక్‌ ఎస్పీ బదిలీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
ఐపీఎస్‌ బలవన్మరణం కేసు.. రోహ్‌తక్‌ ఎస్పీ బదిలీ


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

చండీగఢ్‌/Vఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.): హరియాణాలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌ బలవన్మరణం కేసులో రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. తన భర్త ఆత్మహత్యకు కారకులుగా పూరన్‌ భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్‌నీత్‌ కుమార్‌ పేర్కొన్నవారిలో ఆయనొకరు. దోషులు ఏ స్థాయివారైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ స్పష్టంచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విపక్షానికి హితవుపలికారు. అమ్‌నీత్‌ నివాసాన్ని పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు సందర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు సమ్మతి తెలపకపోవడంతో వారితో పోలీసు అధికారులు చర్చించారు. తమ ఇష్టానికి విరుద్ధంగా మృతదేహాన్ని బలవంతంగా పోస్టుమార్టానికి తీసుకెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మేజిస్ట్రేట్, ఫోరెన్సిక్‌ నిపుణులు, వైద్యుల పర్యవేక్షణలో చండీగఢ్‌లో పోస్టుమార్టం జరగనుందని డీజీపీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande