బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{} కోల్‌కతా,12.అక్టోబర్
బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

కోల్‌కతా,12.అక్టోబర్ (హి.స.): పశ్చిమబెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వివరాలు వెల్లడించలేదు.

బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన యువతి(23) దుర్గాపుర్‌లోని శోభాపుర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. పలువురు దుండగులు వీరిని వెంబడించారు. బాధితురాలిని బెదిరించి సమీప అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీప ఆసుపత్రిలో చేర్పించగా.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande