హిందువులపై దాడులు జరగలేదు.. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోన్న భారత్‌..!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్
Bangladesh President and Head of Interim Government Pay Tribute to Martyrs of Language Movement


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.)బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్‌ భారత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్‌ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ఏడాది షేక్ హసీనా సర్కార్ పతనం తర్వాత హిందువులపై మతపరమైన హింస జరిగిందని వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను అతడు తోసిపుచ్చారు. ఇవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని వెల్లడించారు.

అయితే, ఇటీవల అమెరికా జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బంగ్లా తాత్కాలిక సలహాదారు యూనస్‌.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగు దేశంతో ఘర్షణలు ఉన్నాయి.. వాటిని మతపరంగా చిత్రీకరించకూడదని తెలిపారు. భారత్ ఎప్పుడూ ఫేక్‌ వార్తలలో తమపై ఒత్తిడి తెస్తుంది.. అందుకే వీటిపై తాము చాలా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినట్లు తెలిపాడు. హిందువుల విషయంలో యూనస్ సర్కార్ వ్యవహరించిన తీరు అనాగరికమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇక, గత నవంబర్‌లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకాలో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షించాలని కోరింది. అలాగే, హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande