body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.): ‘నాడు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టాలనేది సమిష్టి నిర్ణయం అని, దీనిలో సైన్యం, పోలీసులు, నిఘా, పౌర సేవా రంగాలు పాల్గొన్నాయని, ఈ విషయంలో ఇందిరా గాంధీని మాత్రమే నిందించలేమని’ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం 1984 నాటి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ను ప్రస్తావించారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని తిరిగి దక్కించుకునేందుకు అనుసరించిన తప్పుడు మార్గంగా ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ను ఆయన అభివర్ణించారు. అయితే నాటి సమిష్టి నిర్ణయానికి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ మూల్యం చెల్లించారని చిదంబరం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ