అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)
అమరావతి: నారా భువనేశ్వరికి ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ అభినందనలు తెలిపారు. భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ అవార్డు వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె సేవలను గుర్తిస్తూ అవార్డు వరించిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు, బ్లడ్ బ్యాంకును భువనేశ్వరి విజయవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. తన సోదరిని అత్యున్నత అవార్డు వరించడం చాలా గర్వకారణమన్నారు. ఆమె ఏ పని చేపట్టినా ఉన్నత శిఖరాలకు ఎదగాలని రామకృష్ణ ఆకాంక్షించారు.
భువనేశ్వరిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్ 4న లండన్‌లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ