body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.)భారత్‌తో బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుందని ఆ దేశ రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి ద్వైపాక్షిక అంశాలతోపాటు కీలక ఖనిజాల ప్రాముఖ్యతపైనా చర్చించామని చెప్పారు. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి మిస్రీతోనూ వరుస సమావేశాలు నిర్వహించానని అన్నారు. ఇక ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని అమెరికా రాయబారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌లతో కూడిన ఓ ఫొటోను ప్రధానికి బహూకరించారు.
ఈ భేటీపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. గోర్ హయాంలో భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాల్లో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ