మెక్సి, 12 అక్టోబర్ (హి.స.)మెక్సికో దేశంలో వరదలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు 40 మంది పౌరులు చనిపోయారు. మరికొంతమంది గల్లంతు అవ్వగా వారి కోసం వెతుకుతున్నారు. వరదల్లో వందల మంది గాయపడ్డారు. వరదల కారణంగా రహదారులు సైతం భారీగా దెబ్బతిన్నాయి. ఇల్లు నీటమునగడంతో పాటు వాహనాలన్నీ కొట్టుకుపోయాయి.
ప్రాణనష్టంతో పాటు తీవ్రంగా ఆస్తినష్టం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, నదులు ఉప్పొంగడం వల్లనే వరదలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV