పావురాల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సైతం సై
ముంబై, 12 అక్టోబర్ (హి.స.)ప్రజాసమస్యలపై పోరాడాలనో.. ప్రత్యర్థులపై వ్యక్తిగత కోపమో లేక మరోదైనా కారణంతోనో రాజకీయ పార్టీలు స్థాపించే వారిని చూసి ఉంటాం. కానీ ఇప్పుడు పావురాల ఆత్మ శాంతి కోసం ఓ రాజకీయ పార్టీ పుట్టుకురావడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా
పావురాల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సైతం సై


ముంబై, 12 అక్టోబర్ (హి.స.)ప్రజాసమస్యలపై పోరాడాలనో.. ప్రత్యర్థులపై వ్యక్తిగత కోపమో లేక మరోదైనా కారణంతోనో రాజకీయ పార్టీలు స్థాపించే వారిని చూసి ఉంటాం. కానీ ఇప్పుడు పావురాల ఆత్మ శాంతి కోసం ఓ రాజకీయ పార్టీ పుట్టుకురావడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పావురాల సంరక్షణ కోసం 'శాంతి దూత్ జన్ కళ్యాణ్ పార్టీ' (Shanti Doot Jan Kalyan Party) మహరాష్ట్రలో (Maharashtra politics) ఆవిర్భవించింది. రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేయబోతోందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే ఇదంతా ఉత్తదే అని కొట్టిపారేయకండి. ఈ పావురాల పార్టీ వెనుక చాలా పెద్ద కథే ఉంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పావురాల పార్టీ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

పావురాల ఆత్మశాంతికోసం సభ..

శాంతికపోతాలుగా పేరున్న పావురాలు చూడటానికి ప్రశాంతంగా, అందంగా కనిపించినా వాటి రెట్టల వల్ల ఉత్పన్నమయ్యే సూక్షజీవులతో చాలా మంది వివిధ రకాల తీవ్ర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో పావురాలకు ఫీడింగ్, సంరక్షణ విషయం గత కొన్నాళ్లుగా ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారుతోంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటున్నందునా జనసమూహాల్లో పావురాలకు ఆహారం పెట్టవద్దని పలు సంస్థలు కోర్టులను సైతం ఆశ్రయించాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ముంబై నగరంలో కబూతర్ ఖానాలను మూసివేస్తూ బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై జైన్ సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆహారం లభించక పలు పావురాలు చనిపోయాయి. దీంతో పావురాల ఆత్మల శాంతి కోసం జైన్ సముదాయం నిన్న ముంబైలో భారీ ధర్మసభ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన జైన్ పెద్దలు ఇంతలో ఈ సభ వేదిక సంచలన ప్రకటన చేశారు. పావురాల కోసం 'శాంతి దూత్ జన్ కళ్యాణ్ పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో షాకింగ్‍గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande