body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై ,13 అక్టోబర్ (హి.స.)టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన (Karur stampede)పై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపింది.
కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులపై జస్టిస్ జె.కె.మహేశ్వరి, ఎన్.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. దీనిపై అన్ని పార్టీలు వ్యక్తంచేస్తున్న అనుమానాలు తొలగాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని.. అందువల్లే ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతినెలా కేసు పురోగతిని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ