body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బెంగళూరు(13 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకలాపాలను నిషేధించాలంటూ ఓ మంత్రి రాసిన లేఖ కర్ణాటకలో కలకలం రేపింది. ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ... ఈ నెల 4న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. లేఖ ఉదంతం ఆదివారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం లేచింది. ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాలు తదితరాల్లో ఆరెస్సెస్ శాఖలు.. భైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించకూడదని, వాటిని నిషేధించాలని లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ