అంబులెన్సుల్లో అన్ని వేళలా ప్రాణాధార వ్యవస్థలు ఉంచాలి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt
Supreme Court


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.) ప్రమాదాల్లో గాయపడిన వారిని, అత్యవసర రోగులను తరలించే అంబులెన్సుల్లో అన్ని వేళలా తగిన విధంగా ప్రాణాధార వ్యవస్థలను అందుబాటులో ఉంచేలా మార్గదర్శకాలు రూపొందించి అవి కచ్చితంగా అమలయ్యేటట్లు చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్‌కు సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం రహదారులపై వెళ్తున్న అంబులెన్సుల నిర్వహణ, నియంత్రణల వాస్తవపరిస్థితి ఎలా ఉందో సమీక్షించేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు ప్రియా సర్కార్, సాయిఅన్ష పనంగిపల్లి విజ్ఞప్తి చేశారు. వీరిలో ప్రియా సర్కార్‌ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ దివంగత డాక్టర్‌ పి.వేణుగోపాల్‌ భార్య కాగా, సాయిఅన్ష ఆయన కుమార్తె. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్సులో సరైన ప్రాణాధార వ్యవస్థలు లేకపోవడం వల్లే డాక్టర్‌ పి.వేణుగోపాల్‌ మృతి చెందారని పిటిషనర్లు పేర్కొన్నారు. అంబులెన్సుల్లో ప్రాణాధార వ్యవస్థలు సక్రమంగా ఉంటే దేశంలో ఎంతోమంది ప్రాణాలను రక్షించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}

---------------

body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande