body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.)బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోన్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై సోమవారం దిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. ఈ కేసులో వారు విచారణను ఎదుర్కోనున్నారు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ