ముంబై, 13 అక్టోబర్ (హి.స.)ఈరోజు కూడా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 30 పెరిగి రూ. 11,495 లకి చేరింది. ఈ ఏడాదిలో బంగారం ధర ఏకంగా 55 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనపడటం, RBI బంగారం నిల్వలు పెంచడం వంటి కారణాలతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మరొకవైపు ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈరోజు (13-10-2025) కూడా దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 1 గ్రాము 22k బంగారం ధర రూ. 30 పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన రూ. 11,495 లకి చేరుకోవడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో బంగారం కొనాలని భావించే వారు ఆందోళనకి గురి అవుతున్నారు.
ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగడం జరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర ఏకంగా 55 శాతం పెరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరగడంతో పాటు యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు లీకులు రావడం, అలాగే అమెరికా డాలర్ విలువ క్రమంగా బలహీనపడడం, మన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బంగారం నిల్వలని మునుపెన్నడూ లేనివిధంగా పెంచుకోవడం, చివరగా ఇన్వెస్టర్లు గోల్డ్ ETF (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వలన బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV