హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందని యూనస్‌లో ఆందోళన..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.)బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల త
హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందని యూనస్‌లో ఆందోళన..


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.)బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని యూనస్ అన్నారు.

షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఏడాది పూర్తయింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, కోర్టులు ఆమెపై అనేక నేరారోపణలు మోపారు. మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక ట్రిబ్యులన్ హసీనా, 29 మంది అవామీ లీగ్ నేతలపై కేసులు పెట్టింది. ఈ కేసుల్లో హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

భారత్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా..? అనే ప్రశ్నకు యూనస్ సమాధానం ఇస్తూ.. ‘‘ వాళ్లకు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, చట్టపరమైన బాధ్యత ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఆమెకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంది, ఆమె వెనక ఉన్నవాళ్లు ఇప్పటికీ ఆమె బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి, విజయవంతమైన నాయకురాలిగా గౌరవం సంపాదిస్తుందని అనుకుంటున్నారు అని యూనస్ అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande