ఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఓట్ చోరి (vote-Chori)కి పాల్పడిందని.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇప్పటికే ఎన్నికల సంఘం కొట్టివేసింది. అలాగే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేదంటే.. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఈసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓట్ చోరి (vote-Chori) ఆరోపణలపై కొంత మంది సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా తారుమారు జరిగిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ని సుప్రీంకోర్టు త్వరలో విచారించనున్నట్లు తెలుస్తుంది. ఈ పిల్ విచారణ బెంచ్‌లో న్యాయమూర్తులు సూర్యకాంత్, యు జోయ్‌మల్య బాగ్చి ఉండనున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV