body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,14, అక్టోబర్ (హి.స.)అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. ఈక్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొంది. శత్రుత్వాలు లేవని మీరు చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి ప్రతికూలంగా ఉన్నాయి. నేటికి దానితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు.. బెదిరింపులతో కూడిన చర్చలు సరికావన్నారు. బెదిరింపులపై చర్యల అనంతరం చర్చలకు అంగీకరిస్తామన్నారు. ఈసందర్భంగా పాక్ (Pakistan) సైనిక ప్రతిస్పందనకు ఆసిఫ్ మద్దతిచ్చారు. దాడికి ప్రతిదాడి సహజమన్నారు. పౌరులను, వారు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కేవలం వారి రహస్య స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. అఫ్గాన్ (Afghanistan) పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాదం ఉందని ప్రపంచానికి తెలుసన్నారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వలీ మోహ్సూద్ గురించి అడగ్గా.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి వారి భూభాగంలోనే ఉన్నారని ఆసిఫ్ బదులిచ్చారు. ఈ సందర్భంగా దౌత్య ప్రయత్నాలలో నిజాయతీ అవసరమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ