body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,14, అక్టోబర్ (హి.స.)ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌కు న్యాయం జరగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చండీగఢ్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. పూరన్ కుమార్‌పై ఎలాంటి ఒత్తిడి ఏర్పడిందో దేశమంతా అర్థం చేసుకుంటుందని తెలిపారు. వేధింపులకు గురి చేసిన అధికారులతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హర్యానా ముఖ్యమంత్రి సైనీని కోరుతున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ