body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,14, అక్టోబర్ (హి.స.) గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ మారనుందని గూగుల్ (Google) క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్‌సీ-కేబుల్ విధానం అనుసంధానం చేస్తామని చెప్పారు. అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో థామస్ కురియన్ మాట్లాడారు.
‘‘జెమీనీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. దీని ద్వారా ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం కలుగుతుంది. రానున్న ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశముంది. భారత్‌కే కాకుండా విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి ఇది దోహదపడుతుంది’’ అని థామస్ కురియన్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ