భారత్‌కు చమురు సరఫరాలో టాప్.. అమెరికా బెదిరింపులకు తగ్గని రష్యా
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
Russia - Ukraine issue


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}

ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.)అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్ని హెచ్చరికలు చేసినా, భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మన దేశంలోని రిఫైనరీలు (పెట్రోలు, డీజిల్ తయారీ కేంద్రాలు) రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ఇతర దేశాల నుండి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేస్తోంది. కానీ, అందులో అత్యధికంగా రష్యా నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం రష్యానే భారత్‌కు ముడి చమురు సరఫరా చేసే అతి పెద్ద దేశం అని తాజా నివేదికలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్‌ సంస్థ కెప్లెర్ విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2025 సెప్టెంబర్‌లో భారత్‌ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమూరులో 34 శాతం రష్యా (మాస్కో) నుంచే వచ్చింది. అంటే ,సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 45 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే, ఆగస్టు నెలతో పోల్చితే సెప్టెంబర్‌లో ఈ కొనుగోళ్లలో 10 శాతం తగ్గుదల కనిపించింది అని నివేదికలు చెబుతున్నాయి.

ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో రష్యా నుంచి భారత్‌కు 70,000 బ్యారెళ్లు ఎక్కువ చమురు వచ్చింది. కానీ, గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ నెలలో భారత్‌ రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. దీని వలన రష్యా, మొత్తం చమురు దిగుమతుల్లో 34% వాటాతో భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. అయితే, 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు రష్యా నుంచి వచ్చిన సగటు రోజువారీ చమురు సరఫరాతో పోలిస్తే, సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 1,80,000 బ్యారెళ్ల తక్కువగా ఉంది. ఈ తగ్గుదలకి కారణం మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులేనని, అమెరికా నుంచి వచ్చిన బెదిరింపులకు దీనితో ఎలాంటి సంబంధం లేదని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థ కెప్లెర్ స్పష్టంగా తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande