body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
కోల్‌కతా,15.అక్టోబర్ (హి.స.)
బెంగాల్ మెడికల్ విద్యార్థిని అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెతన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన సమయంలో, ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈకేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. బాధితురాలు తన వాగ్మూలంలో తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు నిందితుడు అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆమె తండ్రి తన ఫిర్యాదులో అతడి పేరును కూడా పేర్కొన్నాడు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్.
నిందితుడిని రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో ఏడాది చదువుతోంది. రాత్రి సమయంలో తన మగ స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరగింది. అయితే, ఈ కేసులో ఒకరు మాత్రమే ఆమెపై అత్యాచారం చేశారని, గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాధితురాలి కథనానికి మద్దతు ఇచ్చే భౌతిక ఆధారాలు ప్రకారం, ఆమెపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని అసన్సోల్ దుర్గాపూర కమిషనర్ సునీల్ కుమార్ చౌదరి తెలిపారు. నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ