body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.)
హరియాణాలో వరుసగా పోలీసు అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. రోహ్‌తక్ ఏఎస్సై సందీప్‌కుమార్‌బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందీప్ మరణానికి సంబంధించి పూరన్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ ను అరెస్టు చేయాలంటూ సందీప్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఇచ్చేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో దాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమ్నీత్‌ను జైలులో పెట్టిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని తేల్చిచెప్పారు. లంచం తీసుకున్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి గన్‌మెన్ ఇటీవల అరెస్టయ్యాడు. ఈ అరెస్టుకు సంబంధించి సందీప్‌ను హింసించారని ఆయన కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ వేధింపుల గురించి రెండు రోజుల ముందు తమతో చెప్పినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ