body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
గడ్చిరోలి: ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.)మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం ఫడణవీస్ జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. తీవ్ర ఒడిదొడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే.
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ