body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.)అమెరికాకు బుధవారం నుంచి అన్ని రకాల పోస్టల్ సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు భారతీయ తపాలా శాఖ మంగళవారం ప్రకటించింది. అమెరికా కస్టమ్స్ శాఖ కొంతకాలం క్రితం అంతర్జాతీయ వాణిజ్య సరకుల బట్వాడాదారులపై(కొరియర్లపై) అదనపు సుంకాలు విధించింది. భారతీయ తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యే సరకులకు ఈ సుంకాలు వర్తించవు. అయినా కొత్త నిబంధనలకు అనుగుణంగా తగు మార్పులు చేర్పులు చేసుకోవడానికి తపాలా శాఖ ఆగస్టు 22 నుంచి అమెరికాకు తన సర్వీసులను నిలిపివేసింది. కొత్త నిబంధనల ప్రకారం అమెరికాకు తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యే సరకులపై ప్రకటిత కన్‌సైన్‌మెంట్ విలువలో 50 శాతాన్ని కస్టమ్స్ సుంకంగా చెల్లించాలి. ఇది భారతీయ ఎగుమతిదారులకు గిట్టుబాటవుతుందనీ, మన ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, ఈ-కామర్స్ ఎగుమతిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని తపాలా శాఖ వివరించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ