body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
పట్నా:ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో (Bihar Elections) వ్యక్తిగతంగా పోటీకి దూరమయ్యారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని.. తాను మాత్రం పోటీ చేయనని పీకే (Prashant Kishor) తెలిపారు.
‘‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దానికి నేను కట్టుబడి ఉన్నాను. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించాం. పార్టీ ప్రయోజనాల మేరకే నేను పోటీకి దూరంగా ఉంటున్నా. ఒకవేళ నేను పోటీలో ఉంటే.. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లే అవకాశం ఉంది’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ