body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ముంబై,15,అక్టోబర్ (హి.స.)దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తున్నాయి. రెండురోజుల పాటు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో.. మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చింది. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 82,350 వద్ద ఉండగా.. నిఫ్టీ 102 పాయింట్లు పుంజుకొని 25,247 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.27 గా ఉంది.
నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 0.13 శాతానికి పరిమితమైంది. అది కూడా సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. దేశీయంగా కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు కీలకంగా మారాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ