body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,,16 , అక్టోబర్ (హి.స.)ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
2014లో మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సాయుధ దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గతేడాది గుజరాత్‌లోని కచ్‌లోని సర్ క్రీక్‌లో వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆపరేషన్ సిందూర్ గుర్తుగా గోవా తీరంలో జరుపుకోనున్నట్లు సమాచారం.
2014లో లడఖ్‌లో.. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో.. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో వేడుకలు జరుపుకున్నారు. 2020లో మాత్రం కరోనా సమయంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని లాంగేవాలాలో జరుపుకున్నారు. 2021లో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరాలో సైనికులతో గడిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ