కర్నూలు , 16 అక్టోబర్ (హి.స.)కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స్ఫూర్తి కేంద్రంలోని రాజ దర్బార్ గోడలపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం శివాజీ విగ్రహం వద్దకు వెళ్లి నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించిన ఆయన ధ్యానముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం ధ్యాన మందిరంలో ధాన్యం చేసుకున్నారు. అయితే ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సందర్శించారు. అక్కడ ఉన్న నిర్వాహకులు, సీఎం చంద్రబాబు, పవన్‌తో కలిసి ప్రధాని మోదీ ఫోటోలు దిగారు.
ప్రధాని మోదీ సందర్శనతో ఇప్పుడు అందరి దృష్టి శివాజీ స్ఫూర్తి కేంద్రంపైనే పడింది. ఇంతకు శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాధాన్యత ఏంటి. మోదీ ఎందుకు అక్కడే ధ్యానం చేస్తున్నాంటే దేశ వ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో వెలసిన శక్తిపీఠం కూడా ఒకటి. భ్రమరాంబ దేవి చత్రపతి శివాజీకి యుద్ధం చేసేందుకు ఖడ్గం ఇచ్చారని.. ఆ ఖడ్గంతోనే దిగ్విజయంగా రాజ్యాలపై విజయం సాధించారని, ఆ స్ఫూర్తి భావితరాలకు అందేలా శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వెలిసిందని చెప్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV