body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:17pt;}.cf5{font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.pf0{}
కోల్‌కతా,16.అక్టోబర్ (హి.స.)పశ్చిమబెంగాల్ (West Bengal)లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో మమతా వ్యాఖ్యలను తప్పుపట్టిన బాధితురాలి తండ్రి తాజాగా క్షమాపణలు చెప్పారు. మమతా మాకు తల్లిలాంటిదని పేర్కొన్నారు (Durgapur Rape Case).
అత్యాచార ఘటనపై మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బాధితురాలు అర్ధరాత్రి 12:30కి బయటకు ఎలా వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే, తన కుమార్తెను ఉద్దేశిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలను రెండు రోజుల క్రితం బాధితురాలి తండ్రి తప్పుబట్టారు. ఘటన గురించి తనకు రాత్రి 10:15 గంటలకు ఫోన్ ద్వారా తెలిసిందన్నారు. అయితే, ఈవిషయంపై బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘మమతాబెనర్జీ మాకు తల్లిలాంటి వ్యక్తి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని ఆమెను కోరుతున్నా. నా కుమార్తెకు మాత్రం న్యాయం జరిగేందుకు సాయం చేయాలని ఆమెను అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఈ క్రమంలో అత్యాచార ఘటన తన కుమార్తె భవిష్యత్తును ముగించేసిందన్నారు. తనకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. తన కుమార్తెలా ఇతర మహిళలకు ఇలాంటిది జరగకూడదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ