body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf3{font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,,16 , అక్టోబర్ (హి.స.)దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్), దిల్లీ నగరవాసులకు దీపావళి పండగ ముంగిట ఆనందంకలిగించే కీలక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. పండగ రోజుల్లో హరిత బాణసంచా విక్రయాలకు, కాల్చడానికి అనుమతించింది. అదే సమయంలో కొన్ని షరతులనూ విధించింది. పర్యావరణం, ఆరోగ్య పరిరక్షణతో పాటు సంప్రదాయాలు, మతపరమైన ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని, వాటి మధ్య సమతుల్యత పాటిస్తూ తీర్పు వెలువరించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పష్టం చేసింది. జీవించే హక్కు, వృత్తి హక్కులపై ప్రభావాన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ